పూనమ్ పాండేపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్

  • గర్భాశయ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకే చనిపోయినట్టు ప్రచారం చేశానన్న పూనమ్
  • నీ మంచి ఉద్దేశాన్ని ఎవరూ ప్రశ్నించలేరన్న వర్మ
  • నీ మాదిరే నీ ఆత్మ కూడా చాలా అందమైనదంటూ ప్రశంస
గర్భాశయ క్యాన్సర్ కారణంగా సినీ నటి పూనమ్ పాండే చనిపోయారనే వార్త సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. అయితే తాను చనిపోలేదని, సర్వైకల్ క్యాన్సర్ పై మహిళ్లలో అవగాహన కల్పించేందుకు తాను మృతి చెందినట్టు ప్రచారం చేశానని ఈరోజు ఆమె తెలిపి, అందరికీ షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో, ఎక్స్ వేదికగా సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ పూనమ్ పై ప్రశంసలు కురిపించారు. 

'హేయ్ పూనమ్ పాండే... గర్భాశయ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు నీవు ఎంచుకున్న విధానం కొంత విమర్శలకు తావివ్వొచ్చు. కానీ, ఈ కల్పిత ప్రచారం ద్వారా నీవు సాధించిన దాన్ని, నీ మంచి ఉద్దేశాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. ఇప్పుడు అంతటా గర్భాశయ క్యాన్సర్ పైనే చర్చ జరుగుతోంది. నీ మాదిరే నీ ఆత్మ కూడా చాలా అందమైనది. సంపూర్ణమైన, సంతోషకరమైన జీవితం నీకు ఉండాలని కోరుకుంటున్నా' అని వర్మ ట్వీట్ చేశారు.

Ram Gopal Varma
Poonam Pandey
Tollywood
Bollywood

More Telugu News